Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూడు బైకులు, పుస్తెలతాడు స్వాధీనం
నవతెలంగాణ-హుజూర్నగర్
ఇద్దరి దొంగలను పోలీసులు అరెస్టు చేసిసన సంఘటన పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది.కోదాడ డీఎస్పీ రఘు వివరాలను వెల్లడించారు. పట్టణ పరిధిలోని మట్టపల్లి బైపాస్ రోడ్డు వద్ద ఈ నెల 12వ తేదీన వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఏపీ 37 డీఎస్ 9193ఈ నెంబర్ గల వాహనంపై ఇద్దరు వ్యక్తులు వాహనాన్ని ఆపకుండా ముందుకు వెళుతూ పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేశారు.గుంటూరు పట్టణానికి చెందిన బండి శివకుమార్ తండ్రి సాంబయ్య వయసు 46 అదేవిధంగా గుంటూరు జిల్లా పరిధిలోని నరసరావుపేటకు చెందినతమ్మిశెట్టి గోపి తండ్రి వీరాంజనేయులు పట్టుకుని విచారించగా హుజూర్నగర్ పట్టణానికి చెందిన రెండు బైక్‌లను, మఠంపల్లి మండల పరిధిలో ఒక ద్విచక్ర వాహనాన్ని, సూర్యాపేటమండలపరిధిలోని ఉండ్రుగొండ గ్రామానికి చెందిన మహిళ పుస్తెలతాడును వీరి నుండి రికవరీ చేశారు.అదేవిధంగా వీరు గతంలో కూడా ఇటువంటి నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లిన చరిత్ర ఉంది.వీరిని పోలీసులు రిమాండ్ చేశారు.దొంగలను పట్టుకున్న పీఎస్సై స్వప్న, ఐడీ పార్టీ సిబ్బంది అజిత్‌రెడ్డి, సాంబయ్య, నాగరాజు, నాగిరెడ్డిలను డీఎస్పీ అభినందించారు.ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డి, ఎస్సై వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.