Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి రూరల్
భువనగిరి జిల్లా అభివద్ధి కోసం 30 ఏండ్లుగా పాటు పడుతున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి తెలిపారు. గురువారం ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ 18 ఏండ్లుగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్గా పని చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోనూ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు సేవ చేసినట్టు తెలిపారు. పీసీసీ కోశాధికారిగా కూడా రాష్ట్రానికి సేవలు అందించినట్టు తెలిపారు.
భువనగిరి ప్రాంతాన్ని అభివద్ధి చేయడమే తన ధ్యేయమని అందులో భాగంగానే బీజేపీలో చేరినట్లు తెలిపారు. భువనగిరి నియోజకవర్గ పరిధిలోని గల 200 నుండి 300 ఎకరాల్లో ఐటీ రంగాన్ని అభివద్ధి చేసేందుకు కొంతమంది ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరుపుతున్నానని తెలిపారు. 1979 నుంచి తాను రాజకీయాల్లో అనేక విధాలుగా ఈ ప్రాంతానికి సేవ చేయాలని దఢ సంకల్పంతో ఉన్నట్టు తెలిపారు. అందులో భాగంగానే భువనగిరి నియోజకవర్గ అభివద్ధి చేసే దిశగా ప్రత్యక్షంగా 50 వేల మంది ఉద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. పరోక్షంగా మరో 50 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. భువనగిరి ప్రజలు వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే అభివద్ధి చేసి చూపిస్తానని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా ఆయన దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు నాయకత్వంలో భువనగిరి ప్రాంత అభివద్ధికి కషి చేస్తానని తెలిపారు.