Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
మండలంలోని పెద్దపడిశాల గ్రామంలో బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ ప్లాంట్ను గురువారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిల్య ఆ పార్టీ రాష్ట్ర నాయకులు అండెం సంజీవరెడ్డితో కలిసి ప్రారంభించారు.సంజీవరెడ్డి, అయిలయ్యలను ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో బీర్ల ఫౌండేషన్ వైస్ చైర్మెన్ ఈరసరపు యాదగిరి గౌడ్,సింగిల్ విండో చైర్మెన్ లింగాల భిక్షం గౌడ్,మాజీ ఎంపీపీ ద్యాప కష్ణారెడ్డి,స్థానిక ఎంపీటీసీ కొర్న నరేష్, సర్పంచ్లు ఏలూరి రాంరెడ్డి,తుమ్మ డెన్నిస్ రెడ్డి, ఎంపీటీసీలు సంగి అలివేలు వెంకటాద్రి,కెమిడి అనిత రవికుమార్,ఉపసర్పంచ్ బందెల ప్రమోద్ కాంగ్రెస్ నేతలు ఆకుల ఆంజనేయులు, శ్రీనివాస్, మహేందర్, మల్లేష్, నర్సయ్య, రమేష్, సోమిరెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.