Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఐద్వా, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు
నవతెలంగాణ -నల్గొండ
దేశంలో ఏ మూలన చూసినా ఆడబిడ్డల ఆర్తనాదాలు వినబడుతున్నాయని మహిళలకు రక్షణ కల్పించలేని పరిస్థితుల్లో పాలకులు ఉన్నారని, ఆడబిడ్డలను రక్షించుకుందాం హింసోన్మాదాన్ని వ్యతిరేకిద్దామని పాలడుగు ప్రభావతి ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నారు. బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని పెద్దగడియారం సెంటర్లో ఐద్వా, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ బతుకమ్మా బతుకానీయవమ్మా అంటూ ఆడపిల్లలను పుట్టనిద్దాం ఎదగనిద్దాం చదవనిద్దాం అనే నినాదం నేడు ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. దేశంలో ఆరేళ్ల పసిపాపలా నుండి అరవై ఏళ్ల వద్ధుల పైన జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తోంటే దేశం ఎటుపోతోందోనని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనలకు ప్రధాన కారణమైన మద్యం మత్తు పదార్థాలను నిషేదించాలని అక్రమ వ్యాపారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండా అనురాధా , జిట్టా సరోజా , జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ ఎస్ఎఫ్ఐ జిల్లా అద్యక్షులు ఖమ్మంపాటి శంకర్ ఉపాధ్యక్షులు ఆకారపు నరేష్ డీవైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి గుండగోని నవీన్ ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శులు భ్షుతం అరుణ కుమారీ , పాదురు గోవర్ధని ,పట్టణ అధ్యక్షురాలు కనుకుంట్ల ఉమరాణి, డీవైఎఫ్ఐ సహాయ కార్యదర్శి సుకుమార్ , మౌనిక , లక్ష్మమ్మ , రేణుక. రావణ్ ,మహేష్ , యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.