Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరిటౌన్
పట్టణంలోని మీనా నగర్ 28వ వార్డులో శనివారం విద్యుత్ సమస్యతో సుమారు 50 ఇండ్లల్లో విద్యుత్ మీటర్లు, ఫ్రిజ్లు, కూలర్లతో పాటు విద్యుత్ పరికరాలు కాలిపోయాయి. విషయం తెలుసుకున్న కౌన్సిలర్ కైరంకొండ వెంకటేశంలు పలువురి ఇండ్లల్లో కాలిపోయిన పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పొత్నక్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ వారానికోసారి ట్రాన్స్ఫార్మర్ కాలి పోతుందన్నారు. 11కేవీ వైరు వచ్చి మిగతా వైర్లపై పడడంతో విద్యుద్ఘాతం సంభవించి పరికరాలన్నీ కాలి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఈరపాక నరసింహ, సల్లావుద్దీన్, వడిచర్ల కృష్ణయాదవ్, బాధితులు నర్సిరెడ్డి, వేణు రామారావు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.