Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మంత్రి జగదీశ్‌రెడ్డి
అ ఘనంగా దసరా వేడుకలు
నవతెలంగాణ - సూర్యాపేట
తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలకు సూర్యా పేట పుట్టినిల్లు లాంటిదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. దసరా పండగ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని జమ్మిగ డ్డలో ఏర్పాటు చేసిన శమీ పూజ కార్యక్రమంలో మంత్రి దంపతులు హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రకృతి బాగా సహకరిస్తోందని, వర్షాలు విస్తారంగా కురుస్తూ పాడి పంటలతో తెలంగాణ రాష్ట్రంతో పాటు సూర్యాపేట జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయన్నారు. గతంలో బతుకమ్మ ఆడుకోవడానికి అరకొర వసతులు ఉండేవని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూర్యాపేటలో మినీ ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ ఆడుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు, వసతులు కల్పించినట్టు చెప్పారు. జమ్మిగడ్డ వద్ద శమీ పూజ కోసం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కల్గకుండా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా శాంతికి చిహ్నమైన పావురాలు, బెలూన్లను మంత్రి గాల్లోకి వదిలారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జెడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్‌రావు, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఉప్పల లలితాదేవి, జెడ్పీ వైస్ చైర్మెన్ గోపగాని వెంకట నారాయణగౌడ్, జెడ్పీటీసీ జీడి భిక్షం, పార్టీ రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వర్లు, ఉప్పల ఆనంద్, గండూరి ప్రకాష్, ఉమ్మడి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు మాదిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, గండూరి కృపాకర్, జుట్టుకొండ సత్యనారాయణ, పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి క్యాంప్ కార్యాలయంలో మధ్యాహ్నం ఏర్పాటు చేసిన సహపంక్తి భోజన కార్యక్రమంలో మంత్రి పాల్గొ న్నారు. ముస్లిములు, క్రైస్తవ మత పెద్దలతో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు.