Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆలేరురూరల్
ముదిరాజ్ సంఘం గ్రామ శాఖ అధ్యక్షునిగా ఎదు లింగయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం మండలంలో శర్భనాపురం గ్రామంలో మత్స్యగిరి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లింగయ్య మాట్లాడుతూ ముదిరాజ్ సంఘం బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ఆయనతో పాటు సంఘం ఉపాధ్యక్షునిగా శ్రీశైలం, కార్యదర్శిగా వెంకయ్య, జహంగీర్, సహాయ కార్యదర్శిగా కృష్ణ, వెంకటేష్, సలహాదారుడిగా నాగయ్య, సభ్యులుగా నర్సింలు, జానీ, శ్రీనులను ఎన్నుకున్నారు.