Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణ అభివద్ధి,జాతీయ ఉపాధి హామీ చట్టం కమిషనర్ ఆడావత్ శరత్నాయక్ను శనివారం మిర్యాలగూడలో బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మాలోతు దశరధనాయక్, బంజారా సంఘం నియోజకవర్గ ఉపాధ్యక్షులు కేతావత్ సీతా రాంనాయక్, వాటర్తండా సర్పంచ్ రాంచందర్ నాయక్,బంజారా సంఘం యూత్ లీడర్ మెగావత్ నాని నాయక్, ఎన్నెస్పీ ఉద్యోగి ఎల్లయ్య, సీనియర్ అడ్వకేట్ శ్రీధర్, ఉద్యోగసంఘం నాయకులు జైత్రంనాయక్, డాక్టర్ జితేందర్నాయక్, పార్తునాయక్, సర్పంచ్ ఆనంద్నాయక్లు కమిషనర్గా పదోన్నతి లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తండాల అభివద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, ప్రతి తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీగా గుర్తించాలని కోరారు. ప్రతి తండాలో సీసీరోడ్డు నిర్మాణానికి ఉపాధిహామీచట్టం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.మిర్యాలగూడలో ఏర్పాటు చేయనున్న సన్మాన కార్యక్రమం విషయమై చర్చించారు.