Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ-బోనకల్
కాంగ్రెస్ జెండా పేద ప్రజలకు అండగా అని సీఎల్పీ నేత, ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు. విజయదశమి సందర్భంగా మండల పరిధిలోని రావినూతల గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెసు దిమ్మపై జెండాను ఆవిష్కరించారు. స్వర్గీయ వైస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాలి దుర్గారావు, జడ్పీటీసీ సభ్యులు మోదుగు సుధీర్ బాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువాళ్ల దుర్గాప్రసాద్, డీసీసీ కార్యదర్శి పైడిపల్లి కిషోర్ గోవిందాపురం ఎల్ గోవిందపురం ఏ ఏ సర్పంచ్లు భాగం శ్రీనివాసరావు, ఉమ్మినేని బాబు, కలకోట సర్పంచ్ యంగల దయామణి, చొప్పకట్లపాలెం సర్పంచ్ యర్రం శెట్టి సుబ్బారావు, చిరునోముల సర్పంచ్ ములకారపు రవి, సీతానగరం సర్పంచ్ మాలెంపాటి వాణి, వైస్ ఎంపిపి గుగులోత్ రమేష్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు షేక్ జమాలుద్దీన్, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు కర్నాటి రామకోటేశ్వరరావు, ఎస్సి సెల్ అధ్యక్షుడు మారుపల్లి ప్రేమ్ కుమార్, మండల యూత్ కాంగ్రేస్ అధ్యక్షుడు భూక్య భద్రు నాయక్, ఐఎన్ టి యు సి అధ్యక్షుడు మేకల శరత్, సేవాదళ్ మండల అధ్యక్షుడు చింతేటి సురేష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.