Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో ఉన్నటువంటి వైన్స్ ను వేరే ప్రాంతానికి తరలించాలని, బస్టాండ్ వద్ద వైన్స్షాపుకు పరిమిషన్ ఇవ్వొద్దని డీివైఎఫ్ఐ జిల్లా కోశాధికారి ఎదూనురి వెంకటేశం ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. బస్టాప్ దగ్గర వైన్స్ ఉండడం వలన ప్రతి రోజు పాఠశాలకు కళాశాలలకు వెళ్లే విద్యార్థినులకు ఇబ్బందిగా ఉందని అదేవిధంగా దేవాలయాలు కూడా ఉన్నాయని వైన్స్ షాపు వల్ల ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అధికారులు స్పందించి వచ్చే టెండర్లలో అనాజిపురం బస్ స్టాప్ దగ్గర వైన్స్ కి పర్మిషన్ ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.