Authorization
Mon Jan 19, 2015 06:51 pm
27న మున్సిపల్ కార్యాలయం
ఎదుట ధర్నా
నవతెలంగాణ-చౌటుప్పల్
చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎమ్‌డి.పాషా, మున్సిపల్ కార్యదర్శి బండారు నర్సింహా తెలిపారు. సోమవారం మున్సిపల్ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో జటంగి కష్ణ అధ్యక్షతన మున్సిపల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 వార్డుల్లో సర్వే నిర్వహించి సమస్యలు తెలుసుకుంటామని తెలిపారు. 19వ వార్డులో చెరువు అలుగు నీటితో సర్వీసు రోడ్డు పక్కన ప్రజలు, దుకాణదారులు, వ్యాపారులు డ్రయినేజీ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. డ్రయినేజీ నిర్మాణం చేయకపోవడంతో పాదచారులు, వాహనదారులు ప్రయాణం చేయాలంటే నరకయాతనగా ఉందన్నారు.ఈ నెల 27న సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మెన్‌్ బత్తుల శ్రీశైలం, ఫ్లోర్‌లీడర్ గోపగోని లక్ష్మణ్, నాయకులు గోశిక స్వామి, దండ అరుణ్‌కుమార్, ఆకుల ధర్మయ్య, బత్తుల దాసు, గోశిక కరుణాకర్, భావండ్లపల్లి స్వామి, బుర్రి గోపాల్‌రెడ్డి, ఎర్ర ఊషయ్య, పంతంగి సోమరాజు, ఉష్కాగుల శ్రీను, చీకూరి ఈదయ్య, బొడ్డు రాజు, బొమ్మకంటి కష్ణ, ఎమ్‌డి.ఖయ్యుమ్, కనకయ్య, జంగయ్య, దశరథ, వెంకటేశం పాల్గొన్నారు.