Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి
నవతెలంగాణ - నేరేడుచర్ల
టీఆర్ఎస్ పరిపాలనలో ఆర్భాటమే తప్ప అభివృద్ధి శూన్యమని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి విమర్శించారు. సోమవారం పట్టణంలో ఎస్కేఎస్ ఫంక్షన్హాల్లో హుజూర్ నగర్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మఠంపల్లిలో అటవీ భూములు, చింతలపాలెంలో వందల ఎకరాల భూములను అధికార పార్టీకి చెందిన నాయకులు కబ్జా చేశారన్నారు. రాబోయే ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో కాంగ్రేస్ గెలవబోతోందని జోస్యం చెప్పారు. హుజూర్‌నగర్‌లో డిగ్రీ కళాశాల, 100 పడకల ఆస్పత్రి, లిఫ్టులను ఏర్పాటు చేసిన ఘనత తమకే దక్కిందన్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాటికి తోడు మళ్లీ ధరలు పెంచడం సరికాదన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. పాఠశాలల్లో టీచర్ల కొరత తీవ్రంగా ఉందన్నారు. రాష్ట్రంలో మద్యం దందా జోరుగా సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, నేరేడుచర్ల మండలాధ్యక్షుడు కొనతం చిన్నవెంకట్‌రెడ్డి, అల్లం ప్రభాకర్‌రెడ్డి, యారగాని నాగన్నగౌడ్, నూకల సందీప్‌రెడ్డి, మంజునాయక్, తన్నీరు మల్లికార్జున్, ఎన్వీ.సుబ్బారావు, గోపాల్ నాయక్, మోతిలాల్ నాయక్, కటకం రమేష్, బచ్చల కూరి ప్రకాష్, బైరెడ్డి జితేందర్‌రెడ్డి, రణ పంగ నాగయ్య, ఇనుపాల పిచ్చిరెడ్డి పాల్గొన్నారు.