Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
అనారోగ్యానికి గురై ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ధర్మజిగూడెం గ్రామానికి చెందిన ఊదరి శివశంకర్, రూ.15 వేలు, చౌటుప్పల్‌కు బాలయ్యకు రూ.10 వేలు రాజీవ్ స్మారక ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ కార్యదర్శి ఎండి. ఖయ్యుం రాజీవ్ ట్రస్ట్ నిరుపేద కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి,మాజీ సర్పంచి బద్రి లింగయ్య, బత్తుల శ్రీహరి, కొంతం బుచ్చిరెడ్డి, రాచకొండ భార్గవ్, చెరుకు మహేందర్ తదితరులు పాల్గొన్నారు.