Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ పరిధిలోని తంగడపల్లి పీహెచ్సీలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ వందశాతం పూర్తిచేశారు. సోమవారం మున్సిపల్ చైర్మెన్ వేన్రెడ్డి రాజు కేక్ కట్‌చేసి స్వీట్లు పంపిణీచేశారు. అనంతరం వైద్యబందాన్ని శాలువా లతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, వైస్‌చైర్మెన్ బత్తుల శ్రీశైలం, డిప్యూటీ డీఎంహెచ్ఓ యశోద, మెడికల్ ఆఫీసర్ శివప్రసాద్‌రెడ్డి, డాక్టర్ కాటంరాజు, కౌన్సిలర్లు గోపగోని లక్ష్మణ్, బండమీది మల్లేశం, ఆలె నాగరాజు, సందగల్ల విజయసతీశ్గౌడ్, కాసర్ల మంజుల, కామిశెట్టి శైలజ, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.