Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండూరు :మండలం అన్ని రంగాల్లోనూ అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం విమర్శించారు.మంగళవారం స్థానిక మార్కెట్‌యార్డులో నిర్వహించిన ప్రజాసంఘాల జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు.మండలంలోని వివిధ గ్రామాలలో డ్రయినేజీ సమస్య, రోడ్ల సమస్య, రైతుల సమస్యలు, భూరికార్డుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు.పత్తి, వరి ధాన్యం మార్కెట్లోకి వస్తుండడంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకేంద్రాలు, ఏర్పాటు చేయకపోవడం వల్ల కమీషన్ దారులు, మధ్య దళారులు తూకంలో, ధరలో దోపిడీ చేసి నాణ్యత సాకు చూపించి వారి ధాన్యాన్ని రూ.1200 నుండి రూ.1500 మాత్రమే కొనుగోలు చేసి రైతులను మోసం చేస్తున్నారన్నారు. పెండింగ్‌లో ఉన్న రైతుబంధు చెక్కులు, రుణమాఫీలను రైతుఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు.ధరణిపేరుతో ఉన్న భూరికార్డు సమస్యలను పరిష్కరించి ఆన్లైన్లో చేర్చాలన్నారు.పట్టాదారు పాసు బుక్కులు, అడంగల్ పహాణీ,1బీ ఫామ్స్‌ను రైతులకు అందజేయాలని కోరారు.మోగుదాల వెంకటేశం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పార్టీ జిల్లాకమిటీ సభ్యులు కర్నాటిమల్లేష్, మండలకార్యదర్శి బొట్టు శివకుమార్,హమాలీ సంఘం అధ్యక్షుడు పాశం లింగయ్య, గ్రామపంచాయతీ అధ్యక్షుడు ఏర్పుల సైదులు, మున్సిపల్ రామచంద్రం, చిట్టిమల్లలింగయ్య, అచ్చినశ్రీనివాసులు, ధనమ్మ, ఎల్లమ్మ, నర్సింహ, మైసయ్య, వెంకన్న, అండాలు పాల్గొన్నారు.