Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో కిడ్నీలో రాళ్ల తొలగింపు
ప్రొఫెసర్ పీవీఎల్ఎన్ మూర్తి, జీఎం డాక్టర్ శౌరీరెడ్డి
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
ఉమ్మడి నల్లగొండజిల్లాలోనే మొట్టమొదటిసారిగా అత్యాధునిక పరికరాలతో తులియం లేజర్ చికిత్సలను కామినేని వైద్య విద్యా కళాశాల, హాస్పిటల్ నార్కట్‌పల్లిలో అందుబాటులో ఉందని ఆ కళాశాల యూరాలజీ జి.ప్రొఫెసర్ పీవీఎల్ఎన్.మూర్తి, జీఎం డాక్టర్ శౌరీరెడ్డి పేర్కొన్నారు.మంగళవారం స్థానిక కామినేని వైద్య విద్యా కళాశాలలో.ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు.తులియం లేజర్ చికిత్సతో కిడ్నీలలో రాళ్లను పగలగొట్టడం, ప్రోస్టేట్ ఆపరేషన్ చేయడం, మూత్రసంచి క్యాన్సర్‌ను తొలగించడం, మూసుకుపోయిన మూత్రనాళంను కోతపెట్టవచ్చునని వివరించారు.కామినేని వైద్య కళాశాలలో 30 ఏండ్ల విశిష్ట అనుభవగ్యులైన ప్రొఫెసర్ పీవీఎల్ఎన్మూర్తి వారి బందంచే అన్ని రోజులు ఇరువై నాలుగుగంటలు కిడ్నీ కేసులు చూడబడుననని తెలిపారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు కూడా చేస్తామన్నారు.ఈ చికిత్స ద్వారా అతి తక్కువసమయంలో తక్కువ రక్తహీనత ద్వారా తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయిలో మెరుగైన చికిత్స పొందవచ్చని పేర్కొన్నారు.నిడమనూరు మండలానికి చెందిన 8 ఏండ్ల మీనా కిడ్నీలోరాళ్ల సమస్యతో తమ ఆస్పత్రిలో చేరిందని మొదటిసారిగా ఆ చిన్నారికి తులియం లేజర్చికిత్స అందించా మన్నారు.వైద్యపరంగా ఎలాంటి సమస్యలు లేకుండా విజయవంతంగా చిన్నారి పూర్తిస్థాయిలో ఆరోగ్యం ఉందని ప్రకటించారు.తమ వైద్య విద్యా కళాశాలలో ఆస్పత్రిలో చార్జీలు ఉండవన్నారు.కేవలం మందులు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇవి ఆరోగ్యశ్రీలో అందుబాటులో కలవన్నారు.కావున ఈ సదవకాశాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లావాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ సమావేశంలో వైద్య బందం సభ్యులు ఎంఎస్ డాక్టర్ లూధర్, డాక్టర్ సాదన్, డాక్టర్ నరేందర్ , మార్కెటింగ్ పీఆర్ఓలు మురళీకష్ణ, కిరణ్ పాల్గొన్నారు.