Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు సవరాల సత్యనారాయణను మంగళవారం రాచర్ల ఫౌండేషన్ చైర్మెన్ రాచర్ల కమలాకర్ ఆధ్వర్యంలో మంగళ వారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా రాచర్ల కమలాకర్ మాట్లాడుతూ గతంలో ఏ రాజకీయ పార్టీలో లేని విధంగా సీఎం కేసీఆర్ ఆర్యవైశ్యలకు సముచిత స్థానం కల్పించారన్నారు. రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి కూడా వైశ్యులకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్, డైరెక్టర్ల పదవులు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులతో పాటు టీఆర్ఎస్ పట్టణాధ్యక్ష పదవి కూడా ఆర్యవైశ్యులకే ఇవ్వడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఉప్పల ఆనంద్, తోట శ్యామ్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు చల్లా లక్ష్మీకాంత్, ముప్పారపు నాగేశ్వర్రావు, చల్లా లక్ష్మీ ప్రసాద్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులు, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు.