Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఎంతో పోరాట ఫలితంగా సాధించిన అడవి దేవులపల్లి మండల ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు, పూర్తి స్థాయిలో పోస్టుల భర్తీ చేసి ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.మంగళవారం వాయిలకొల్లు ఈదయ్య నగర్‌లోని పార్టీ కార్యాలయంలో పార్టీ మండల ద్వితీయ మహాసభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మహాసభనుద్దేశించి మాట్లాడారు. ప్రజాసమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.ఒకరికొకరు తీసిపోని విధంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్నాయన్నారు.వాటిని ప్రతి ఘటించేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. రైతాంగ వ్యతిరేక నిర్ణయాలు,కార్మిక వ్యతిరేక విధానాలు, యువకులకు ఉద్యోగల భర్తీ,చేయకుండా తీరని అన్యాయం చేస్తున్నారని తెలిపారు.భవిష్యత్‌లో ప్రజాసమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటానికి సీపీఐ(ఎం) మహాసభలు వేదికగా మారబోతోన్నాయని స్పష్టంచేశారు. తదనంతరం మండల కన్వీనింగ్ కమిటీని ప్రకటించారు.కన్వీనర్‌గా బొద్దు బాలసైదులు, కో కన్వీనర్‌గా కొర్ర సైదానాయక్లను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు,రవినాయక్, టీజీఎస్ జిల్లా కార్యదర్శి శంకర్‌నాయక్, సీనియర్ నాయకులు పాపానాయక్, జటంగి సైదులు, మండల కార్యదర్శులు శశిధర్‌రెడ్డి, వినోద్‌నాయక్, నాయకులు కోటిరెడ్డి, పాతని శ్రీను, బాబునాయక్, శివ, కోటి, మండవ సైదులు, అనసూర్య, కుమారి పాల్గొన్నారు.