Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
పెన్‌పహాడ్:బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై మోయలేని భారాలు వేస్తుందని, ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటాయని, ఇంకా ధరలు పెంచడం సరికాదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మంండల కేంద్రంలో నెమ్మాది ఆడివయ్య అధ్యక్షతన నిర్వహించిన పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లధనాన్ని వెలికితీసి ప్రజలకు పంచుతానని, నెలరోజులల్లో ధరలు అదుపు చేస్తానని, ప్రతి పెదవాన్ని ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని చెప్పిన మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ విస్మరించారని విమర్శించారు. బీజేపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు దళితులపై చిత్తశుద్ధి ఉంటే దళితబంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రానున్న రోజుల్లో తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి రణపంగ కృష్ణ, వీరబోయిన రవి, గుంజ వెంకటేశ్వర్లు, గోపిరెడ్డి, పీరయ్య, బుచ్చిరాములు, నవీన్, గోపాలదాస్ సైదులు, ఇరుగు రమేష్, సిరపంగి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.