Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జహంగీర్
భువనగిరి :ఉత్తర ప్రదేశ్ లఖీంపూర్ ఖేరిలో నలుగురు రైతులు, జర్నలిస్టు హత్యలకు కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రాను వెంటనే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ డిమాండ్ చేశారు. మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం భువనగిరి రైల్వేస్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని పది నెలలుగా దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న పోరాటాన్ని అణగదొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హత్యా రాజకీయాలను ఖండించారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని, పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయిస్తూ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన రైతు కుటుంబాలను ప్రధానమంత్రి పరామర్శించక పోవడం అత్యంత హేయమైన చర్య అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడున్నరేండ్ల మోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలు రైల్వే, విమానయానం, బొగ్గు, చమురు, భూములు, పరిశ్రమలను కారుచౌకగా డబ్బున్న వారికి కట్టబెట్టిందన్నారు. రైతు హత్యలకు కారణమైన కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయకపోతే ఉద్యమం మరింత ఉధతమై బీజేపీ సర్కార్ ను కూల్చి వేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ, డీవైఎఫ్ఐ రాష్ట్రకార్యదర్శి అనగంటి వెంకటేష్ గారు, జిల్లా కమిటీ సభ్యులు దాసరి పాండు, దయ్యాల నర్సింహ, వనం రాజు,వడ్డెబోయిన వెంకటేష్, కూకుట్ల కష్ణ, కొండ ఆశోక్, పర్వతి బాలకష్ణ, ఓవల్దాసు అంజయ్య, బందెల ఎల్లయ్య, కల్లూరి నాగమణి, మాటూరి కవిత, కొండ హైమవతి ,బర్ల వెంకటేష్, పత్తి సుధాకర్, రాహులు పాల్గొన్నారు.