Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
నవతెలంగాణ - సూర్యాపేట
రాష్ట్రంలో పెరిక కులస్తులకు ప్రత్యేక గౌరవం ఉందని, వారు స్వశక్తితో జీవిస్తారని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆ సంఘం జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన మాట్లాడారు. అన్ని కులాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాన అవకాశాలు కల్పిస్తోందని చెప్పారు. పెరిక కులస్తులు తమ పిల్లలకు ఉన్నత విద్యనందించి విద్యావంతులు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల కోసం ప్రతి సంవత్సరం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డితో మాట్లాడి జిల్లా కేంద్రంలో పెరిక కులస్తుల సంఘం భవనానికి 2 నుంచి ఐదెకరాల భూమి ఇప్పించి భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మెన్ అల్లం నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కేవలం తొమ్మిది శాతం ఉన్న కులాలు మనలను ఏలేందుకు కారణం మనలో ఉన్న నిర్వహణా లోపమేనన్నారు. పెరిక కులానికి గుర్తింపు లేదని, ఇప్పటికే వృత్తి గురించి తెలియదన్నారు. వృత్తి లేకున్నా ఇప్పటికీ అందరూ నిజాయితీగా ఉన్నామంటే అది పెరిక కులానికి ఉన్న స్వభావమేనని అన్నారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులుగా వనపర్తి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శిగా సముద్రాల రాంబాబులతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు అంగిరేకుల నాగార్జున అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు జుట్టుకొండ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బోడకుంట్ల వెంకటేశ్వర్లు, పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్ధ లింగయ్య, హైదరాబాద్ పెరిక హాస్టల్ అధ్యక్షుడు శ్రీరామ్ దయానంద్, కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ, రాష్ట్ర నాయకులు డాక్టర్ మిన్న రామకృష్ణ, దొంగరి వెంకటేశ్వర్లు, ప్రభాకర్‌వర్మ, బాలిశెట్టి శిరీష నాగేందర్, సుంకరి అజరు, బొలిశెట్టి కృష్ణయ్య, దొంగరి శ్రీనివాస్, గన్న చంద్రశేఖర్, బుర్రి శ్రీరాములు, జుట్టుకొండ బసవయ్య, మేఖల నాగేశ్వర్రావు, ముత్తినేని శ్యాంసుందర్, పుల్లూరి అచ్చయ్య, గోదేషి వేణుధర, రామినేని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.