Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలెక్టర్ టి. వినరుకష్ణారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో ఈనెల 25 నుండి నిర్వహించే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ టి.వినరుకష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.బుదవారం కలెక్టరేట్లో నిర్వహించిన పరీక్షల నిర్వహణ సమావేశంలో ఆయన ఆయన మాట్లాడారు.రెవెన్యూ, హెల్త్, పోలీస్, మున్సిపల్, ఆర్టీసీ శాఖలు సమన్వయంతో కలసి పనిచేయాలని సూచించారు.జిల్లాలో ఈనెల 25 నుండి నవంబర్ 3 వరకు జరిగే పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. జిల్లాలో 44 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.అన్ని కేంద్రాలలో పారిశుధ్య పనులు చేపట్టి ముందస్తుగా అందుబాటులో ఉంచాలని సూచించారు.జనరల్ కోర్సులో 7961 మంది అలాగే ఒకేషనల్ కోర్సులో 1684 మంది మొత్తం 9645 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు.పరీక్షల నిర్వహణకు 44 మంది పర్యవేక్షకులు అలాగే 44 మంది అధికారులు, 6 సిట్టింగ్ స్క్వాడ్స్, 2 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించామన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు రాజేంద్రకుమార్, కిశోర్‌కుమార్, వెంకటేశ్వర్లు, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ శిరీష, డీటీడబ్య్లూఓ శంకర్, ఏఓ శ్రీదేవి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
స.హ చట్టంపై సీఎస్ తీసుకున్న నిర్ణయం వెనక్కు తీసుకోవాలి
నవతెలంగాణ-కోదాడరూరల్
సమాచారహక్కు చట్టంపై సీఎస్ తీసుకున్న నిర్ణయం వెనక్కు తీసుకోవాలని సమాచార హక్కు అభ్యుదయ సమితి వ్యవసాపక అధ్యక్షులు పడిశాల రఘు అన్నారు. బుధవారం పట్టణంలోని ఆ సంఘం కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కార్యాలయాల్లో అవసరం నిమిత్తం సమాచారం కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ కార్యాలయ అధికారి సమాచారం ఇచ్చేందుకు పైఅధికారుల అనుమతి తీసుకోవాలని చీఫ్ సెక్రెటరీ జనరల్ ఆదేశాలు జారీ చేయడాన్ని ఆయన ఖండించారు.సమాచార హక్కు చట్టం సమాధి చేసేందుకే అధికారులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.ఈ సమావేశంలో మీసాలఉపేందర్, సైదులు,వీరబాబు పాల్గొన్నారు.