Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి అయిలయ్య
నవతెలంగాణ-చింతపల్లి
నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి అయిలయ్య విమర్శించారు. బుధవారం మండలంలోని కురంల్లి గ్రామంలో నిర్వహించిన పార్టీ మండల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో మధ్యతరగతి కుటుంబాలు రోడ్డు బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నేటి పెట్రోల్ ధరలు పెరిగిపోవడంతో వాహనదారులు బెంబేలిస్తున్నారని, ఉప్పు, పప్పు ధరలు కూడా విపరీతంగా పెరిగిపోవడంతో మధ్యతరగతి కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువ ఉన్నకుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధోరణి ఒకటేనని, ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించి నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని కోరారు.బీజేపీ పాలనలో ఏడేండ్లుగా సరళీ కరణ విధానాల వల్ల నిత్యం పెరుగుతున్న నిరుద్యోగం, అసమానతలు, ఉపాధి, వలసలు, ఆకలి చావులు, పేదరికం, ఆత్మహత్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసి ఆహార భద్రత దెబ్బతీసే మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చి నమ్ముకున్న పేద సన్న, చిన్నకారు రైతులకు భూమికి భక్తి దూరం చేసి కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ చట్టాలను తెచ్చిందన్నారు.వెంటనే నల్లచట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ నెల 26న జరిగే మండల మహాసభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి ఉడుగుంట్ల రాములు, ఎమ్‌డి.సర్దార్, యాదయ్య, వెంకటయ్య, బ్రహ్మచారి పాల్గొన్నారు.