Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మెన్ తిరుమల్‌రెడ్డి
నవతెలంగాణ-అర్వపల్లి
పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మెన్ తిరుమల్‌రెడ్డి అన్నారు.బుధవారం ఆయన మండలకేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.మధ్యాహ్నభోజనాన్ని పరిశీలించారు. విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.రికార్డులను పరిశీలించి పిల్లలు రోజు వస్తున్నారా..? వారికి అందిస్తున్న ఆహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు.పిల్లలతో కాసేపు ముచ్చటిం చారు.గర్భిణులకు, బాలింతలకు సరైన పోషకాహారం అందజేయాలని అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు.రాష్ట్రంలో 58 శాతం మహిళలు రక్తహీనతతో పుట్టిన శిశువులు బలహీనతతో జన్మిస్తున్నారన్నారు. పోషణ్అబియాన్ కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేయాలని ఆదేశించారు.అనంతరం ప్రాథమిక పాఠశాల, జెడ్పీహెచ్ఎస్లో మధ్యాహ్నభోజనాన్ని పరిశీలించారు. మధ్యాహ్నభోజనం అమలుతీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ కిరణ్‌కుమార్, డీఈఓ అశోక్, డీఎస్ఓ విజయలక్ష్మీ, సభ్యులు గోవర్థన్‌రెడ్డి, భారతి, జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి, పద్మ, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ దయానందరాణి, సీడీపీఓ శ్రీజ, ఎంపీపీ మన్నె రేణుక, జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్, సర్పంచ్ బైరబోయిన సునీత, తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీఓ సురేస్, ఎంఈఓ బాలునాయక్, మన్నె లక్ష్మీనర్సయ్యయాదవ్ పాల్గొన్నారు.