Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
తనకు తహసీల్దార్ ప్రోసిడింగ్ కాపీ ఇవ్వడం లేదని ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట తాళ్లమల్కాపురం గ్రామానికి చెందిన వట్టికూటి వెంకటేశ్వర్లు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు చెందిన వ్యవసాయభూమిపై తన సోదరుడు రామారావు మధ్య కొంతకాలంగా వివాదం జరుగు తుందన్నాడు.తన సోదరుడితో తన ముగ్గురు తోబుట్టువులకు పేర పట్టా అయ్యిందన్నాడు. ఎలా అయ్యిందో తెలియజేయాలని సమాచార చట్టం కింద దరఖాస్తు చేసుకున్నా తహసీల్దార్ సమాధానం ఇవ్వడం లేదన్నాడు.దీంతో విసిగిపోయినా తాను పెట్రోల్ పోసుకుంటున్నట్టు తెలిపాడు.అక్కడే ఉన్న కొంత మంది అతన్ని అడ్డుకున్నారు. విషయం మండలంలో సంచలనం సృష్టించింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు.
భూమి పట్టా మార్పిడి చేయడం వాస్తవమే
తహసీల్దార్ కార్తీక్
వెంకటేశ్వర్లు అతని కూతుర్ల పేరు మీదున్న భూమి పట్టా మార్పిడి చేయడం జరిగిన మాట వాస్తవమే.అతని సోదరుడు, తోబుట్టువులు కలిసి ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించడంతో ట్రిబ్యునల్ కోర్టు వెంకటేశ్వర్లు సోదరుడైన రామారావు, వారి తోబుట్టువులు పేరు మీద పట్టా చేయాలని ఆదేశాలు జారీ చేసింది.ఆ ఆదేశాల ప్రకారం ఈపీపీబీ అనే నిబంధన మేరకు పట్టా మార్పిడి చేశామని వివరించారు.కానీ దానికి సంబంధించిన ప్రోసిడింగ్ కాపీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల జనరేట్ కావడంలేదు.సమాచార చట్టం కింద ఫిర్యాదు చేసుకున్నప్పటికీ అందించలేకపోయామని వివరించారు.ఇందులో ఎలాంటి అక్రమాలకు అవకతవకలకు అవకాశం లేదు.