Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు
నవతెలంగాణ-చివ్వెంల
అమాయక గిరిజనులకు ఇండ్లు కట్టిస్తామని చెప్పి సుమారు 20 మంది గిరిజనుల వద్ద నుండి ఒక్కొక్కరి దగ్గర రూ.1.50లక్షల చొప్పున వసూలు చేసిన హోలీ వర్డ్ సొసైటీ నిర్వాహకులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి మట్టిపల్లి సైదులు ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆ సంఘం ఆధ్వర్యంలో మండల ంలోని పాండ్య నాయక్‌తండా, సంగోనితండాలలో బాధి గిరిజనులను ఆయన కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండుల లేని నిరుపేదలైన హోలీ వర్డ్ సొసైటీ ద్వారా ప్రతి లబ్దిదారుడు రూ.4లక్షలకే తమ సంస్థ ద్వారా నాలుగు రూముల ఇండ్లు, మరుగుదొడ్డి నిర్మిస్తామని చెప్పి 5 నెలల కింద 20 మంది గిరిజనుల నుండి రూ.30 లక్షలు వసూలు చేశారని విమర్శించారు.వారి మాటలు నమ్మి అమాయకపు గిరిజనులు అప్పులు తెచ్చి సొసైటీ నిర్వాహకులకు ఇచ్చారన్నారు.డబ్బులు తీసుకొని ఐదు నెలల నుండి గ్రామం వైపు కన్నెత్తి చూడడం లేదన్నారు.ప్రజలను మోసం చేసి ఇబ్బందులకు గురి చేస్తున్న సొసైటీ నిర్వాహకులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జిల్లా అధికార యంత్రాంగం, మంత్రి జగదీశ్‌రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ ఘటన వెలుగులోకొచ్చి రెండురోజులవుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం దురదష్టకరమన్నారు.ఈ కార్యక్రమంలో బాధితులు ధరావత్శ్రీను, అరుణ, సక్రు, మోహన్‌నాయక్, శారద, అనసూర్య, వెంకటి పాల్గొన్నారు.