Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీష్‌రెడ్డి ఆశీర్వాదంతో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ, సాయిబాబా మందిరం చైర్మెన్‌గా, వివేకానంద వద్ధాశ్రయం చైర్మెన్‌గా ఎన్నో సేవాకార్యక్రమాలను తన భుజ స్కంధాలపై వేసుకొని ముందుండి నడిపించిన సవరాల సత్యనారా యణను 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావనికృపాకర్ బుధవారం ఆయన్ను మర్యాద పూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు.శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సవరాల మాట్లాడుతూ తన మీద నమ్మకంతో పట్టణ అధ్యక్షులుగా అవకాశం కల్పించిన మంత్రి జగదీశ్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ బలోపేతానికి తన వంతు కషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కపాకర్, లయన్స్ క్లబ్ సభ్యులు మద్దూరి సుధాకర్, గోపాలకష్ణ, నాగరాజు, గుండా మహేష్,కడివేరి రమేష్,నామ వేణు, జంపాల శ్రీను, కోటగిరి జగదీష్, వాంక్డోతు మల్సూర్,బందారి మధు, సూదిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాసం నవీన్, రాఘవరెడ్డి, మిర్యాల శివ, మురికి నాగరాజు, రాచకొండిశీనివాస్,కుక్కడపు సాలయ్య, కుక్కడపు భిక్షం, ఫణి, బజ్జూరి శ్రీను, పెద్దోజు రామాచారి, కొప్పు సందీప్, రాపర్తి వెంకటేశ్వర్లు, ఉప్పల మంజుల పాల్గొన్నారు.