Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్చేస్తూ ఈ నెల 22,23 తేదీల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న సామూహిక దీక్షలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు రొడ్డ అంజయ్య కోరారు. మున్సిపల్ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో మండలకార్యదర్శివర్గ సమావేశం బొజ్జ బాలయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యంతో మండలం అన్ని రంగాల్లో అభివద్ధిలో వెనుకబడిందని విమర్శించారు. పిలాయిపల్లి కాల్వ పూర్తిచేసి పిల్ల కాల్వల ద్వారా చెరువులను నింపాలని డిమాండ్చేశారు. ఈ నెల 25న ఆర్డీఓ కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బూర్గు కష్ణారెడ్డి, మండలకార్యదర్శి గంగదేవి సైదులు, రాగీరు కిష్టయ్య, చీరిక సంజీవరెడ్డి, యాదయ్య పాల్గొన్నారు