Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-తుర్కపల్లి
మండలంలోని పల్లెపహాడ్ పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసే క్రమంలో మోసం చేసి అవినీతికి పాల్పడిన పీఏసీఎస్ వైస్ చైర్మెన్, పాలక వర్గం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని,బాధిత రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం స్థానికంగా ఆ పార్టీ మండల కమిటీ సమావేశం కొక్కొండ లింగయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెపహాడ్, గొల్లగూడెం, రామోజీ నాయక్ తండ, మోతిరాం నాయక్ తండ గ్రామాలకు చెందిన రైతులు 20 లక్షల రూపాయల దోపిడీకి గురైరన్నారు. వెంటనే సంబంధిత అధికారులపైన, పాలక వర్గం పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండల వ్యాపితంగా జిల్లా అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్, మండల నాయకులు కొక్కొండ లింగయ్య, రాపోల్ నర్సిరెడ్డి, తలారి మాతయ్య,తూటి వెంకటేశం,ఆవుల కలమ్మ, గుండెబోయిన వెంకటేశం, బోడ్డెల్లి హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.
.