Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి
నవతెలంగాణ - ఆలేరుటౌన్
నియోజకవర్గ వ్యాప్తంగా త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని ఆ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ధాన్యం ధరల పట్టిక బ్రోచర్‌ను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. రైతులు ధ్యానాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు అమ్ముకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీది రవీందర్ , మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ గ్యాదపాక నాగరాజు, డైరెక్టర్లు మామిడాక నర్సింహ, అనంతుల జంగారెడ్డి, బద్దునాయక్, పత్తిపాటి మంజూల, బూడిద అయిలయ్య, కష్ణ, మెగులగాని మల్లేష్ గౌడ్, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.