Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చిట్యాల
పట్టణంలో జాతీయ రహదారి పై బుధవారం స్థానిక పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ుూ 10 జ్ు 6160 నెంబరు గల కారు హైదరాబాదు నుండి చెన్నై కి వెళ్తుంది, పోలీసులు తనిఖీలు చేస్తున్నారని గమనించిన కారు డ్రైవర్ కారును రాంగ్ రూట్లో వెళ్లే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు పట్టుకొని తనిఖీలు నిర్వహించారు. కారులో రూ.4 కోట్ల డబ్బును గుర్తించారు, ఆ డబ్బు హవాలాకు చెందినదిగా ప్రాథమిక అంచనావేసి కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.
హుజురాబాద్‌లో కాంగ్రెస్ నేతల ప్రచారం
నవతెలంగాణ -ఆలేరుటౌన్
హుజురాబాద్ శాసనసభ ఉప ఎన్నికల్లో భాగంగా బుధవారం టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డ్డి, ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చేశారు. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యత్కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సురేష్ పార్లమెంట్ జనరల్ సెక్రెటరీ శివశంకర్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.