Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి నేనావత్ జలందర్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వరి కోతలు మొదలై సుమారుగా 20 రోజులు కావస్తున్నా నేటికి కొనుగోలు ప్రారంభించక పోవడంతో రైతులు ఆందోళనతో ఉన్నారన్నారు. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .