Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ చిన్ననీటి ప్రాజెక్టులపై చిన్నచూపు
ఆందోళనలకు శ్రీకారం చుట్టిన సీపీఐ(ఎం)
అ 22,23 తేదీల్లో తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి
అ 29,30కలెక్టరేట్ ఎదుట 48గంటల దీక్షా
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయప్రతినిధి
óప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకురావడానికి చిన్న జిల్లాలను ఏర్పాటు చేస్తున్నాం. వీలైనంత వేగంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కానీ రాష్ట్రం ఏర్పాటై ఏడేండ్లయ్యింది.. ఒక్క సమస్య పరిష్కారం కాలేదు.. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా ఉంది పరిస్థితి. గ్రామాల్లో కనీస వసతులు లేవు.. విద్య, వైద్యం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. నీటి వనరులుంటే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు.. దీనికి అనేక సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేపట్టింది. అయినా కదలికలేదు.
చిన్న నీటి వనరుల పట్ల నిర్లక్ష్యం
యాదాద్రి జిల్లా ఏర్పాటై ఏడేండ్లయినా అభివృధ్ది మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. బస్వాపూర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.1800కోట్లు కేటాయింపులు చేశారు. నీటినిల్వ సామర్ధ్యం 11.39టిఎంసీల నీరు ఉండేలా నిర్మాణం చేస్తున్నారు. దీనికింద సాగు లక్ష్యం 2.50లక్షల ఎకరాలు సాగవ్వాలని నిర్ణయం చేశారు. కానీ ఇప్పటివరకు 48శాతం నిర్మాణం పూర్తయింది. ఇందులో సుమారు రూ.600కోట్లు పెండింగ్ బిల్లులు రావాల్సింది. అవి వస్తే పనులు వేగవంతం చేయలేమని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. కేవలం నిధుల కొరత వల్లే ప్రాజెక్టు నత్తనడకన సాగుతుంది.
- గందమల్ల రిజర్వాయర్ ప్రాజెక్టు పూర్తిగా పెండింగ్‌లోనే ఉంది. నాలుగేళ్లలో పూర్తి చేసి 9టిఎంసీల నీటిని సాగుకోసం అందిస్తామన్నారు. కానీ ఇపుడు ఆ ప్రాజెక్టు
ఉందో లేదో కూడ అంతుచిక్కని సమస్యగా మారింది.
-నారాయణపూర్ ప్రాజెక్టుకు నీరు ఎక్కడ నుంచి తీసుకువస్తారో ఇప్పటివరకు సరైన ప్రతిపాధన లేదు.
- మూసీ ప్రక్షాళన కోసం రూ.300కోట్లు నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. దానికి ఇప్పటివరకు అతీగతి లేకుండా పోయింది. దానికి అడుగు కూడ ముందుకు సాగలేదు.
- ఆసీఫ్ నగర్ కాల్వ నిర్మాణం చేసిన నాటి నుంచి నేటి వరకు ఏలాంటి మరమ్మతులు చేయలేదు. ఆదీ పూర్తిగా ద్వంసమైంది. కాల్వకట్టలు తెగేందుకు సిద్దంగా ఉన్నాయి.
- ఇలా చాలా గ్రామాల మధ్య కల్వర్టులు తెగి చిన్న వర్షం వచ్చిన రాకపోకలు బంద్ చేసే పరిస్థితి వస్తుంది.
విద్య , వైద్యం అందని ద్రాక్షగా మారింది
యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్య , వైద్యం అందని ద్రాక్షగా మారింది. ఉన్నత విద్య అభ్యసించాలంటే హైదరాబాద్‌కు వెళితే తప్ప అందని పరిస్థితి. పేదలకు చదువు కోవడానికి అవస్థలు పడుతున్నారు. ఇక్కడ జిల్లా ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం డిగ్రీ, పీజీ కాలేజీని ఏర్పాటు చేయలేదు. ప్రవేటు కాలేజీలలో చేరాలంటే వేలకు వేలు ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది.
- ఎయిమ్స్‌ను మొదలు పెట్టి ఏడాదైంది. ఇప్పటివరకు ఇన్‌పెషేంట్ వైద్య సేవలు ప్రారంభించలేదు. సరైన వసతులు కల్పించలేదు.
- జిల్లా కేంద్ర వైద్యశాలను సూపర్ స్పెషాలిటి హాస్పిటల్‌గా మారుస్తామని గతంలో హామీ ఇచ్చారు. కానీ హామీ నీటి మూట మాదిరిగా మిగిలిపోయింది. సరైన వైద్యం అందక ఎంతో మంది పేదలు ప్రాణాలు కొల్పోయిన సంఘటనలున్నాయి.
ఇవేగాకుండా అంతర్గత రోడ్లు, స్థానికంగా ఉన్న పరిశ్రమలలో యువతకుఉద్యోగాలు, వాతావరణ కాలుష్యం, మిషన్ భగీరథ, డబుల్బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూపంపిణీ, గ్రామాల్లో పారిశుద్య సమస్యలు అనేకంగా ఉన్నప్పటికి ప్రభుత్వం వాటిపై ప్రత్యేక దృష్టిసారించలేకపోయింది.
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళనలు
జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జన చైతన్య యాత్ర పేరుతో మార్చి 23 నుంచి ఏప్రిల్ 18 వరకు 26 రోజుల పాటుగా 173గ్రామాలు పాదయాత్ర చేసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆ సందర్బంలో వందలాది మంది ప్రజలు తమ సమస్యలను వివరిస్తూ అనేక పిటిషన్లు అందజేశారు. వాటిని పార్టీ తరపును జిల్లా కలెక్టర్, సీఎం, మంత్రులకు లేఖలు కూడ రాశారు. కానీ ఏ ఒక్కటి పరిష్కారం కాలేదు. అందుకే ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈనెల 22, 23 తేదీల్లో జిల్లాలోని అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ నిర్ణయించింది. 25న కార్యాలయ ముట్టడి చేయనున్నట్టు ప్రకటించారు. ఆమేరకు పెద్దఎత్తున ప్రజలను తరలించాలనే విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. అంతేగాకుండా ఈనెల 29, 30 తేదీల్లో మొదటి రోజు యాదాద్రి జిల్లా కలెక్టరేట్ ముందు సాముహిక దీక్షా, రెండోరోజు ధర్నాకు పిలుపునిచ్చారు. అయితే ఈ రెండురోజులు అక్కడే వంట వార్పు చేసుకుని 48గంటలు దీక్షా శిబిరంలోనే ఉండేలా పిలుపునిచ్చారు.
జిల్లా మహాసభల తర్వాత విస్తృతంగా పోరాటాలు.
ఎండి.జహంగీర్ సీపీ(ఐ)ఎం జిల్లా కార్యదర్శి
యాదాద్రి జిల్లా సమస్యలు పరిష్కారం కోసం సీపీఐ(ఎం) ఆధ్వ ర్యంలో అనేక ఉద్యమాలు నిర్వహిం చాం... నిర్వహిస్తున్నాం. అవి పరిష్కారం కాకపోతే పార్టీ జిల్లా మహాసభల తర్వాత మరింత విస్తృత మైన పోరాటాలు నిర్వహిస్తాం. ప్రభు త్వం దిగివచ్చే వరకు పోరాటాలు ఆగవు. తాము చేస్తున్న పోరాటానికి ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిస్తున్నాం.