Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాటూరి బాలరాజ్ గౌడ్
నవతెలంగాణ -నల్లగొండ
కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం ఉచితంగా బైకులను అందజేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాటూరి బాలరాజ్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక వృత్తిదారుల సంఘం కార్యాలయంలో ఆ సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీతన్న బంధు పేరుతో కార్మికులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని, రాష్ట్ర బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించి పింఛన్లు. ఎక్స్‌గ్రేషియా, ఉపాధి అవకాశాలు కల్పించడానికిచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి చౌదరి సీతారాం మాట్లాడుతూ టీసీఎస్‌కు కన్వర్షన్ చేసుకోవడానికి అనేక గ్రామాల్లో గీత కార్మికులు దరఖాస్తు చేసుకున్నా నేటికీ పరిష్కారానికి నోచుకోలేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా గౌరవాధ్యక్షులు పామనగుళ్ళ అచ్చాలు జల్లా సహాయ కార్యదర్శి మక్త్యాల లింగస్వామి. జిల్లా ఉపాధ్యక్షు లు ఉప్పల గోపాలు వెముల కొండ పుల్లయ్య. రాచకొండ వెంకట్ గౌడ్ పాల్గొన్నారు.