Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
అనుమానాస్పద వ్యక్తి నుండి 8 కేజీల గంజాయి పట్టుకున్న సంఘటన బుధవారం పట్టణ శివారులోని కామినేని వై జంక్షన్లో చోటుచేసుకుంది.ఎస్ఐ యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం..నార్కట్‌పల్లి గ్రామశివారులో గల ఎన్‌హెచ్-65 రోడ్ నందు గల కామినేని వై.జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా మహారాష్ట్ర భీమ్‌నగర్ పర్భనికి చెందిన ప్రహ్లాద్ లక్ష్మణ్ విజయవాడ వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు దిగి కామినేని హాస్పిటల్ వైపు వెళ్తుండగా అనుమానంతో అతని బ్యాగును తనిఖీ చేయగా 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసు కున్నారు.గంజాయిని తహసీల్దార్ పల్నాటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
6 కిలోల గంజాయి పట్టివేత
మఠంపల్లి :మండలంలోని మట్టపల్లి వద్ద 6 కిలోల గంజాయి పట్టుకున్నట్టు బుధవారం ఎస్ఐ ఇరుగు రవి తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు నుండి హైదరాబాద్‌కు గంజాయి తరలి స్తుండగా, విశ్వసనీయ సమాచారం ప్రకారం. దాడులు చేసి నిందితులను అదుపు లోకి తీసుకొని విచారణ చేస్తున్నట్టుతెలిపారు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలానికి చెందిన చెందిన అజాంషా, పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన కలగంటిసాయి, నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చెందిన పి.శివ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు.దాడులలో తహస ీల్దార్ లక్ష్మణ్‌బాబు, ట్రైనీ ఎస్సై కరుణ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.