Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఆంధ్రప్రదేశ్లో రౌడీ రాక్షస పాలన సాగుతోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాసుల సత్యం ఆరోపించారు ఏపీలో టీడీపీ నాయకుల ఇండ్లపై, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిని నిరసిస్తూ బుధవారం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార దాహంతో వైసీపీ కార్యకర్తలు రాక్షస పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో కేంద్ర కార్యాలయం ఉన్న వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనమన్నారు.పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. హైకోర్టు డీజీపీ పని తీరుపై అసంతప్తి వ్యక్తం చేసి రాజీనామా చేయాలని ఆదేశించినా పట్టించుకోలేదన్నారు .వెంటనే దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని, రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు.ఆయన వెంట పార్లమెంటరీ ఇన్చార్జి జడ రాములు యాదవ్, మైనార్టీ సెల్ జిల్లాఅధ్యక్షులు జానీమియా, గంధం శ్రీనివాసరావు, జయరామాచారి, రసూల్, సైదానాయక్, వెంకన్న పాల్గొన్నారు.