Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరుటౌన్ : ఆదివాసీల హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌల్ అన్నారు . మండల కేంద్రంలో ఆదివాసుల హక్కుల కోసం పోరాటం చేసిన వీర యోధుడు కొమరం భీమ్ 81 వ వర్థంతి పురస్కరించుకొని సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం ఆదివాసుల హక్కుల కోసం పోరాటం చేసిన యోధుడు కొమరం భీమ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు లక్ష్మీనారాయణ, రమేష్, లక్ష్మయ్య, సారయ్య పాల్గొన్నారు.