Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చౌటుప్పల్ రూరల్
మా ఎన్నికల సందర్భంగా సినీ నటుడు మంచు మోహన్‌బాబు గొర్రెల మేకల పెంపకం దారుల పై చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జీఎంపీఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు బండారు నర్సింహ మాట్లాడుతూ పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన మోహన్‌బాబు పెంపక దారుల పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు.ఈ కార్యక్రమంలో గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం మండల కార్యదర్శి కొండే శ్రీశైలం, నాయకులు ఆవుల ఏసు, నారి బాల నరసింహ, పాక జహంగీర్, ఎల్లంల వెంకటేష్, చంద్రమౌళి, మార్గం నర్సింహ్మ పాల్గొన్నారు.