Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు, మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు రేవంత్ రెడ్డి పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని, తగిన గుణపాఠం తప్పదని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కో ఆర్డినేటర్ , నీలం పద్మ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత షర్మిలకు లేదని ప్రజలను పక్కదోవ పట్టేంచే కుట్రలో భాగంగా తెలంగాణలో ఆమె పర్యటిస్తుందని పేర్కొన్నారు . ఆంధ్రాలో సోదరుడు జగన్‌తో ఒకలాగా తెలంగాణలో మరోలాగా నటించడం సరికాదని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.