Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ
ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని అడ్డుకోని వాటిని కాపాడుకుందామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ,జిల్లా ఉపాధ్యక్షులు ఎండి.సలీం జిల్లా సహాయ కార్యదర్శి దండం పల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. ఆ సంఘం ఆధ్వర్యంలో గురువారం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమంలో భాగంగా ఎఫ్సీఐ, రైల్వే, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, పోస్టల్, ఎలక్ట్రిసిటీ కార్యాలయాల ఎదుట ప్ల కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల పన్నులతో నిర్మితమైన ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అమ్మడానికి కుట్ర చేస్తుందని విమర్శించారు. మాని టైజేషన్ ఆఫ్ పైప్ లైన్ ల పాలసీ పేరుతో ప్రభుత్వ సంస్థలను, భూములను అద్దెకు ఇవ్వాలని నిర్ణయించడం అంటే కార్పొరేట్ శక్తులకు పరోక్షంగా అమ్మడమేనని అన్నారు. ప్రభుత్వ ఆస్తులు అమ్మకాన్ని ప్రజలు ,ఉద్యోగ, కార్మికులు సంఘటితంగా పోరాడి అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, జక్కల రవికుమార్, పోలే సత్యనారాయణ, కత్తుల యాదయ్య ,బీఎస్ఎన్ఎల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు బాణాల పరిపూర్ణ చారి, ఎల్ఐసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కె. నర్సిరెడ్డి, ఎఫ్సీఐ హమాలీయూనియన్ అధ్యక్షులు నకేరేకంటి సుందరయ్య , రైతు సంఘం జిల్లా నాయకులు కుంభం కష్ణారెడ్డి వివిధ రంగాల ఉద్యోగులు కార్మికులు ఆర్ నరసింహ, బి నరేష్ కుమార్ , ఆర్ గోపాలకష్ణ ,వి కష్ణయ్య, రఘు కుమార్, యాదగిరి, సీత వెంకటయ్య, మాండ్ర శీను, గని పెళ్లి రాములు పెరిక అంజమ్మ, దాసారపు రమేష్, పెరిక కష్ణ, చంద్రమ్మ ,ధనమ్మ, పాలకూరి సైదులు, శ్రీకాంత్ సాయి కుమార్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలి
సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు
భువనగిరిటౌన్ : కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణను ఆపేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ప్రధాన తపాల కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధాని అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలైన టెలికాం, పోస్టల్, ఎల్ఐసీ, రైల్వే తదితర ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు అమ్మేందుకు సిద్ధమైందన్నారు. నూతనంగా రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చిందన్నారు. 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కొడులుగా చేసిందన్నారు. నరేంద్రమోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం పట్టణ కన్వీనర్ మాయ కష్ణ. నాయకులు ఎల్లయ్య, ప్రసాద్, కొండయ్య,రాము, రాములు, వెంకటేశం, శాంతమ్మ, కుమారి, లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.