Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలకవీడు:మండలంలోని బొత్తలపాలెం గ్రామంలో వైద్య సిబ్బంది గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి వ్యాక్సినేషన్ వేశారు. గ్రామంలో 18 ఏండ్లు నిండిన వారు 1537 మంది ఉండగా 1507 మందికి టీకా వేసినట్టు వైద్యాధికారులు తెలిపారు. మిగిలిన 30 మంది కూడా వేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మలేరియా స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ సాహితీ, ప్రభుత్వ వైద్యాధికారి నాగయ్య, ఏఎన్ఎం జయమ్మ, ఎంపీవో దయాకర్, ఆశా వర్కర్లు నాగ సుకన్య, అంగన్వాడీ టీచర్ ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.