Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హుజూర్ నగర్:పట్టణంలోని 20వ వార్డులో వేయనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చన రవి గురువారం వార్డ్ కౌన్సిలర్ దొంతగాని పద్మ శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్, వైస్ చైర్మెన్ జక్కుల నాగేశ్వర్రావు, కౌన్సిలర్ గాయత్రి, భాస్కర్, బుజ్జి బాబు, జి.అర్జున్, వీరబాబు, జి.రాంబాబు, అంజి తదితరులు పాల్గొన్నారు.