Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి
నవతెలంగాణ - సూర్యాపేట
పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివని సూర్యాపేట జిల్లా కలెక్టర్ టి.వినరు కృష్ణారెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎస్.రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి పాల్గొన్నారు. ముందుగా పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సమాజ రక్షణలో పోలీసు నిర్విరామంగా పని చేస్తున్నారని, విధుల నిర్వహణలో అమరులైన పోలీసు సిబ్బంది కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఎలాంటి సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తేవాలని కోరారు. ఎస్పీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సమాజ రక్షణలో పోలీసు రాత్రి, పగలు అనే తేడా లేకుండా పని చేస్తున్నారని తెలిపారు. సంఘవిద్రోహక శక్తులతో పోరాడి మావోయిస్టుల ప్రాబల్యం తగ్గించి మావోయిస్టు రహిత రాష్ట్రంగా చేయడంలో పోలీసులు తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాటం సాగించారని అన్నారు. జిల్లాలో మావోస్టులతో పోరాడి అమరుడైన షేక్ బడే సాహెబ్, సిమీ తీవ్రవాదులతో పోరాడి అమరులైన కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేష్‌కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, అమరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.