Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూర్యాపేటరూరల్
ప్రతి గ్రామ పంచాయతీని 100 శాతం వ్యాక్సినేటెడ్గా మార్చాలని ఎంపీపీ రవీందర్రెడ్డి కోరారు. గురువారం మండల పరిధిలోని బాలెంల గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను సందర్శించి మాట్లాడారు. కరోనా కట్టడిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామస్వామి, శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు.