Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిడమనూరు
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగం మరువలేనిదని ఎస్సై డి.సైదులు అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా గురువారం మండల కేంద్రంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరవీరుడు ఉన్నం చెన్నకేశవులు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చెన్నకేశవ యూత్ అధ్యక్షుడు ఉన్నం ఈశ్వర్, కానిస్టేబుల్ సైదానాయక్, శేఖర్, శివ కుమార్, వెంకట్, హనుమానాయక్, హోంగార్డులు శ్రీను, అప్పారావు సీహెచ్.శ్రీను, లలితమ్మ తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ:విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలే స్ఫూర్తి కావాలని విద్యుత్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, నల్లగొండ జిల్లా అధ్యక్షులు మారం శ్రీనివాస్ అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా గురువారం పట్టణంలో నివాళులర్పించి మాట్లాడారు. పోలీస్ అంటేనే పట్టుదల, ఓర్పు, సహనమని, శాంతి భద్రతలను కాపాడేందుకు వారు చేసే కృషి మరువలేనిదన్నారు.
పెద్దవూర:పోలీసు అమర వీరుల త్యాగాలు మరువలేనివని ఎస్సై పచ్చిపాల పరమేష అన్నారు. పోలీస్ అమర వీరుల దినోత్సవం సందర్భంగా గురువారం నాగార్జున సాగర్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై రామ్మూర్తి, ప్రొవిజినల్ ఎస్సై శ్రీరాం, గోపి, సిబ్బంది స్వామి, నాగరాజు, మధు, రవీందర్రెడ్డి, రవినాయక్, హరిలాల్, ఏడు కొండలు, గీతాంజలి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.