Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ-నిడమనూరు
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ముప్పారం జిల్లా పరిషత్ పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాలలో ఉన్న వసతులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో స్వీపర్లు లేరని, టాయిలెట్స్ శుభ్రంగా లేవని ఉపాధ్యాయులే శుభ్రం చేసుకోవాల్సి వస్తుందని పాఠశాల ఉపాధ్యాయులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో పశువులు వస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ పాఠశాల సమస్యల పరిష్కారానికి తను కృషి చేస్తానన్నారు. ప్రహరీ గోడ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నలపరాజు వెంకన్న, యూటీఎఫ్ మండల అధ్యక్షుడు కోమరాజు వెంకన్న, సైదులు, అశోక్, సురేందర్‌రెడ్డి, సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.