Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు
తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-త్రిపురారం
పెరిగిన నిత్యావసర వస్తువులు తగ్గించేంత వరకూ పోరాటాలు ఆగబోవని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో కొప్పు వెంకన్న, గోగుల ఇద్దయ్య అధ్యక్షతన నిర్వహించిన పార్టీ 7వ మండల మహాసభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతు, వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి రైతులను కూలీలుగా మార్చేందుకు కుట్ర పన్నుతోందన్నారు. కార్మిక హక్కులను కాలరాసేందుకు తీసుకొచ్చిన చట్టాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేరించాలని కోరారు. ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అయినా రోజు రోజుకూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై మరింత భారం వేయడం సరికాదన్నారు. రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఉత్తుత్తి హామీలిస్తూ మోసం చేస్తుందన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కూన్రెడ్డి నాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పండించే ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి దైద శ్రీను, జానకి రామచంద్రయ్య, లక్ష్మయ్య, కృష్ణ, లింగమ్మ, జానయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.