Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాంపల్లి
మండలంలోని తుంగపాటి గౌరారం ఉపసర్పంచ్, యూత్ కాంగ్రెస్ నాయకుడు ముమ్మడి కష్ణా రెడ్డి తన అనుచరులతో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కూసు కుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ నుంచి పెద్దఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నా రన్నారు.పార్టీలో చేరిన వారిలో పులుగు నరహరి, వైద్యులశేఖర్, పులిజాలసురేష్ మరో 20 మంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలకన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్‌రెడ్డి, మండలఅధ్యక్షులు గుమ్మడపు నర్సింహారావు, మండల అధికార ప్రతినిధి పోగుల వెంకట్‌రెడ్డి, మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నడింపల్లి యాదయ్య, కడారి శ్రీశైలం యాదవ్,బీసీ సెల్ మండలకార్యదర్శి వట్టికోటి నరేష్, టీపీగౌరారం గ్రామశాఖ అధ్యక్షులు బేగరి కిరణ్, టీఆర్ఎస్ నాయకులు తన్నీరు వెంకన్న, దశరథ పాల్గొన్నారు.