Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రాఫిక్ సీఐ చీర్ల శ్రీనివాస్
నవతెలంగాణ-నల్లగొండ
పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ప్రజలు, వ్యాపారులు సహకరించాలని ట్రాఫిక్ సీఐ చీర్ల శ్రీనివాస్ కోరారు.శుక్రవారం పట్టణంలోని పాత చౌరస్తా నుండి నెహ్రూగంజ్ వరకు దుకాణాల ముందు ఉన్న సామగ్రి, ఆక్రమణల కారణంగా వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల దుకాణదారులు, వ్యాపారస్తులకు ఆయన అవగాహన కల్పించారు.పాత చౌరస్తా నుండి గంజ్ వరకు ఉన్న రోడ్డు చిన్నగా ఉండడం, వాహనాలు పెద్దసంఖ్యలో తిరుగుతుండడం, ఉదయం సమయంలో భారీ వాహనాల రాక పోకల కారణంగా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులను తాము అనేక సమయాల్లో గుర్తించామన్నారు.చాలామంది దుకాణదారులు వారి షాపులకు సంబంధించిన సామగ్రిని షాపుల ముందు పెట్టడం కారణంగా రోడ్డు ఇరుకుగా మారి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ట్రాఫిక్ సమస్య పెరగడం కారణంగా ఎదురయ్యే పలు విషయాలను వివరించారు.ఆయన వెంట ఎస్సై జయానందం, ఏఎస్సై రవి, కానిస్టేబుళ్లు మహేందర్, వెంకటేశ్వర్లు, జాన్సన్, వెంకట్రెడ్డి ఉన్నారు.