Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కోదాడరూరల్
ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలును రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ తెలంగాణ మెడికల్, ప్రజా ఆరోగ్య వైద్య ఉద్యోగుల సంఘం హెచ్ - 1 యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం డీఎంఅండ్‌హెచ్‌వో కోటాచలంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు భూతరాజు సైదులు మాట్లాడుతూ రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో యూనియన్ జిల్లా అధ్యక్షులు భూతరాజు సైదులు, కార్యదర్శి యాతాకుల మధుబాబు, రాధాకుమారి, నీరజ, వీరలక్ష్మి, విజయ కుమారి, కళ్యాణి, మంగ, రజియా, ప్రమీల, రూపవతి, కల్పనా, ధనమ్మ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.